బాహుబలి అవంతిక త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట. ఇటీవలే తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న తెల్లపిల్లకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉన్నారట తమ్మూ కుటుంబ సభ్యులు. దక్షిణాదిన టాప్ హీరోయిన్గా.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన తమన్నా.. ప్రస్తుతం విక్రమ్ సరసన స్కెచ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని డిసైడైందట.
మరో రెండు సినిమాలకు ఇప్పటికే సంతకాలు చేసేసిన తమన్నా.. నటనతో పాటు తండ్రి నగర వ్యాపారంలోనూ సాయం చేస్తుంది. ఇప్పటికే తమన్నా సోదరుడికి పెళ్లి కుదిరింది. పనిలో పనిగా తమన్నాకు కూడా పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ అమ్మడికి తగిన వరుడు కోసం సంబంధాలు వెతికేపనిలో పడ్డారట. దీంతో తెల్లపిల్లకు తగిన వరుడు ఎవరోనని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.