కానీ తుఫాన్ వల్ల థియటర్లకు ప్రేక్షకులు వస్తారో రారోనని ఎగిబీటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాలు తమిళంలోనూ, తెలుగులోనూ, కేరళలో నూ విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చోట్ల వర్షాలు భీబత్సంగా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దాంతో వారి సినిమా కలెక్షన్లకు బ్రేక్ పడినట్లుగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
యాధ్రుచికమైనా ఇద్దరు హీరోల పేర్లలో కామన్ గా `ఎన్` అనే అక్షరం వుందని, కనుక ఇద్దరికి ఫలితాలు ఒకేలా వుంటాయని ఇండస్ట్రీకి చెందిన ఓ విశ్లేషకుడు తెలియజేస్తున్నాడు. నానికి అంతకుముందు, అంటే సుందరానికి, హిట్ సినిమాలు ఆవించినంతగా ఆడలేకపోయాయి. ఒక్క దసరా సినిమా కూడా బాగా ఆడిందనే టాక్ వచ్చింది. అయితే కొన్ని చోట్ల ఆ సినిమా కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
ఇక నితిన్ కు మాచర్ల నియోజకవర్గం, లై, చల్ మోహన రంగా సినిమాలు అంతగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయింది. అందుకే ఆచితూచి తను సినిమాలు చేస్తున్నాడు. ఒక్క భీష్మ సినిమా నితిన్ కుమంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఎక్స్ ట్రాడినరీ మేన్ అంటూ ముందుకు వస్తున్నాడు. అయితే ఈాసారి పూర్తి వినోదంగా రాబోతున్నానని చెబుతున్నాడు. ప్రతి సారీ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఏదో సన్నివేశమో, పాటను సింక్ చేసే నితిన్ ఈసారి బాలక్రిష్ణపై సెటైర్ గా ఓ సన్నివేశాన్ని చూపించాడు. బాలయ్యకు కోపం ఎక్కువంటగదా.. అని ట్రైలర్ లో సీనియన్ నటి అన్నపూర్ణమ్మ అగడడం దానికి నితిన్ బదులివ్వడం.. వంటివి సరదాగా వున్నా. అధి సినిమా విజయానికి ఎంత మేరకు సహకరిస్తాయో చూడాలి.