పూరి జగన్నాథ్, ఛార్మిల మధ్యనున్న ఎఫైర్ గురించి టాలివుడ్ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గతకొన్నాళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోందని.... ఆ సన్నిహిత్యంతోనే స్టార్ డైరెక్టర్ అయిన పూరి ఒక చిన్న చిత్రాన్ని కేవలం ఛార్మి కోసం నిర్మించాడని ఎన్నోపుకార్లు షికార్లు చేశాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ''జ్యోతి లక్ష్మి'' చిత్రమే ఇందుకు సాక్ష్యం. ఆ సినిమా సమయంలో వీరి రిలేషన్షిప్ తారా స్థాయికి చేరుకుంది. అయితే ఆ చిత్రం ఛార్మికి అనుకున్నంత హిట్ ఇవ్వలేదు.
దీంతో ఎలాగైనా ఆమెను నిర్మాతగా నిలబెట్టేందుకు పూరి తన అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా వీరిద్దరు ఒక బిజినెస్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పూరి సినిమాలో బిజీ బిజీగా ఉండడం వల్ల ఆయన తరఫున ఆయన సన్నిహితుడు ఛార్మితో బిజినెస్ చేస్తున్నాడట. పూరికి ఛార్మికి రిలేషన్ ఉంది అనేందుకు ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. మరి వీరిద్దరి బిజినెస్ వ్యవహారం మరెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.