జబర్దస్త్ టీమ్ హాటీ రష్మీ కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా అందాలను బాగానే ఆరబోసిన రష్మీ.. హీరోయిన్గా నటించేందుకు మంచి ఆఫర్లను సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నా బుల్లితెర జబర్దస్త్తోనే రష్మీకి క్రేజ్ మొదలైంది. దాంతో 'గుంటూర్ టాకీస్'లో హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది.
ఆ మూవీ హిట్ కావడంతో రష్మికి ఆఫర్లు క్యూ కట్టాయి. సరైన ప్లానింగ్ లేకుండా రష్మి వచ్చిన ప్రతి ఆఫర్ని ఓకే అనేసింది. 'గుంటూర్ టాకీస్' తరువాత రష్మి చేసిన సినిమాలను జనం పట్టించుకోవట్లేదు. క్రేజ్ తగ్గడంతో ఆఫర్లు సైతం తగ్గిపోయాయి. అయినా వెండితెరపై కనిపించేందుకు ఐటమ్ సాంగ్స్ చేసేందుకు అమ్మడు రెడీ అయిపోయింది.