ముక్కోణపు ప్రేమకథతో తమిలంలో కాథువాకుళ రెండు కాదల్ రూపొందింది. విఘ్నేష్ శివన్ రచన, దర్శకత్వంలో రూపొందింది. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది. ఉదయనిధి స్టాలిన్ తన బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్‌పై పంపిణీ చేసారు. ఇందులో హీరో విజయ్ సేతుపతి. మరో నాయిక సమంత. ఇటీవలే తెలుగులో కూడా విడుదలచేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 28న సినిమా విడుదల కాబోతోంది.
అయితే సినిమా ప్రమోషన్‌కు నయనతార వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. తను కూడా నిర్మాతే కాబట్టి ఆమె వస్తేనే సినిమా ఎంతో కొంత ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. సోమవారం నుంచి పబ్లిసిటీ ప్రారంభించనున్నారు. ఇందుకు విజయ్‌సేతుపతి, సమంత సిద్ధంగా వున్నారు. మరి నయనతార మనసులో ఏమివుందో ఇంకా వెల్లడించలేదు.
కానీ, సమంతతోపాటు నయనతార కూడా ప్రమోషన్ కోసం రాబోతున్నదని తెలుస్తోంది. ఒకవేళ వస్తే, ప్రభుదేవా, శింబువంటివారితో వున్న వ్యక్తిగత విషయాలు కూడా ఎవరో ఒకరు అడిగే ఛాన్స్ వుందని, ముందుగానే కేవలం సినిమా కోసమే అంటూ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత కూడా నాగచైతన్యకు దూరంగా వుంది. ఆ తర్వాత మీడియా ముందుకు రాలేదు. సో. ఏమి జరుగుతుందో కొద్ది రోజుల్లోల తెలియనుంది.