ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి త్వరలో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైందట. విదేశాల్లో ఈమధ్యే ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసుకున్న సాయిపల్లవికి పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నారట. అయితే సాయిపల్లవి మాత్రం మరో నాలుగేళ్ల పాటు తనకు వివాహం వద్దని కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రస్తుతం సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది.
కానీ గత కొన్నిరోజుల ముందు ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవి సాయిపల్లవికి ఫోన్ చేసి పెళ్ళి చేసుకుందామని ప్రపోజ్ పెట్టాడట. గంటా రవి అంటే జయదేవ్ సినిమాతో పరిచయమైన వ్యక్తి. దీంతో సాయిపల్లవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదట. నాలుగేళ్ళ పాటు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసిందట. దీంతో జయదేవ్ తన తండ్రి గంటా శ్రీనివాసరావు ద్వారా సాయిపల్లవి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారట.