అంతేకాదు... ఇంకా మరికొన్ని చిత్రాలకు సంబంధించి ఆఫర్లు వస్తున్నా తిప్పికొడుతోందట. దీనితో కోలీవుడ్ సినీజనం అసలు సమంతకు ఏమైంది అంటూ గుసగుసలు పోతున్నారట. మరోవైపు సమంత-నాగచైతన్యలు ప్రేమలో పడ్డారనీ, ఇద్దరికి డిసెంబరు నెలలో పెళ్లి జరుగబోతోందనీ ప్రచారం కూడా ఊపందుకోవడంతో.... సమంత చిత్రాలను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనేమో అని కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.