తెల్లపిల్ల తమన్నాకు 2025 కలిసొచ్చినట్లే కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత తమన్నా భాటియా తన జీవితంలోని కొత్త ఛాప్టర్ ప్రారంభిస్తోంది. హ్యాపీగా, స్వేచ్ఛగా వుంటోంది. సినిమా ఫంక్షన్లలో ఆకర్షణీయమైన లుక్‌తో పాటు అద్భుతమైన ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఆత్మవిశ్వాసమే తన కొత్త సంతకం అని నిరూపిస్తోంది.