పాలబుగ్గల తమన్నా ''బాహుబలి'', ''ఊపిరి'' సినిమాల సక్సెస్‌లతో మాంచి ఊపుమీదుంది. ఇప్పుడు ఈ అమ్మడికి ఉన్నరేంజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను వాడేసుకోవాలని స్టార్ హీరోలు సైతం తమన్నానే కావాలని పట్టుబడుతున్నారట. తెలుగు, తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో తమన్నా గోల్డెన్ లెగ్గా మారిపోయింది.
అయితే ఈ భామ స్పెషల్ సాంగ్ కోసం ఎంత ఆఫర్ చేసిందో తెలిస్తే ఖంగుతినాల్సిందే. ఎంతో తెలుసా అక్షరాల కోటిన్నరట డిమాండ్ చేసిందట. రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేయడంతో ప్రొడ్యూసర్స్‌కి చుక్కలు కనిపించాయట. చివరకు ఎన్టీఆర్ చొరవతో కాసింత తగ్గించుకున్నట్లు సినీవర్గాల విశ్వసనీయ సమాచారం. మొత్తానికి తమన్నాని ఐటం గాళ్‌గా చిందేయనుందన మాట.