సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

సెల్వి

బుధవారం, 26 జూన్ 2024 (17:07 IST)
4 year old boy
తమిళనాడు, నాగపట్నం, వేళాంగణిలో ఓ బాలుడు సామాజిక సేవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కన్న తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్, ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి సంఖ్య పెరిగిపోతున్న ఈ కాలంలో తమిళనాడు, వేళాంగణి రోడ్డుకు సమీపంలో వున్న వృద్ధులకు నాలుగేళ్ల బాలుడు ఆహారంతో పాటు నీటిని అందజేశాడు. 
 
ఆ బాలుడి టీషర్ట్ వెనుక సామాజిక సేవకుడని రాసి వుంది. ఇంకా సంప్రదింపు కోసం ఫోన్ నెంబర్ కూడా వుంది. రోడ్డుపై నివసిస్తున్న వృద్ధులకు ఆ బాలుడు భోజనం ప్యాకెట్లతో పాటు నీటి బాటిళ్లను అందజేశాడు. దాన్ని స్వీకరించిన వృద్ధులు ఆ బాలుడిని ఆశీర్వదించారు. 

"வயசு சிறுசு சேவை பெருசு".. வேளாங்கண்ணியில் சாலை ஓரங்களில் தங்கியுள்ள ஆதரவற்றோர்களை தேடி தேடி சென்று கூப்பிட்டு உணவு வழங்கிய 4 வயது சிறுவன்… மனம் நெகிழ்ந்து வாழ்த்திய பெரியவர்கள்..!#Nagapattinam | #Velankanni | #Food | #Children | #PolimerNews pic.twitter.com/e3mfODwewg

— Polimer News (@polimernews) June 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు