ఈ మొత్తం మహేష్ బాబు స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 2.0 చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రషెస్ చూసిన బయ్యర్స్ ఎంత రేటుకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చిత్రంలో దమ్ముందనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులోనే 75 కోట్లకు అమ్ముడయితే ఇక హిందీ, తమిళం ఇతర భాషల్లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో మరి. పైగా రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో చిత్రం వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఐతే అంతకుముందు వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.