ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీలో సల్మాన్, లులియా, వెంకటేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లులియాతోతో వెంకీ చాలా సేపు సమావేశమయ్యారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో కలసి నటించే విషయంపై చర్చించేందుకే ఈ పార్టీకి వెంకీ వెళ్లారని చెబుతున్నారు.
మరోవైపు, సల్మాన్ ప్రియురాలు లులియా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోందా? అనే కోణంలో కూడా చర్చ మొదలైంది. అయితే, ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మాత్రం ఇంతవరకుబయటకు పొక్కలేదు. లులియాతో కలసి వెంకీ ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, వెంకీ. సల్లూభాయ్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్న విషయం తెల్సిందే.