భారతీయ సినిమాకు కొత్తప్రమాణం నిర్దేశిస్తున్న బాహుబలి2: షాకింగ్‌లో ట్రేడ్ ఎనలిస్టులు

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (10:14 IST)
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? గత 21 నెలలుగా ప్రతి భారతీయుడి మనస్సును కలిచివేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరుకుతున్న రోజు వచ్చేసింది. గురువారమే తెలుగు రాష్ట్రాల్లోని కొంతమందికి అనుభవంలోకి వచ్చేసినా నేడు అంటే శుక్రవారం యావత్ ప్రపంచానికి ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. బాహుబలి 2 ది కంక్లూజన్ విడుదల ఈ రహస్యాన్ని విప్పిచెప్పనుంది. ట్రేడ్ పండిట్లు, చిత్రరంగ నిపుణులు చెబుతున్నది నిజమే అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి2 భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశించనుంది.
 
2015 జూలైలో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ అబిమానులను దిగ్బ్రాంతికి గురి చేస్తూనే బాక్సాఫీసు వద్ద 600 కోట్ల రూపాయలు వసూలు చేసి బాలీవుడ్‌నే నివ్వెరపర్చింది. అంతకుముందెన్నడూ చూడని నట దృశ్యాలు, మైమరిపించే స్టోరీ లైన్‌తో బాహుబలి చరిత్రను సృష్టించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బాహుబలి 2 విడుదల కోసం రెండేళ్లుగా ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు.  హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో శుక్రవారం విడుదలైంది. భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని వందలాది నగరాలు, పట్టణాలు ఒక సినిమాకోసం వెర్రెత్తిపోవడం 80 ఏళ్ల సినీరంగ చరిత్రలో ఇదే మొదటిసారి. 
 
దక్షిణాది సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ ఎనలిస్టులు ఇవ్వాళ బాహుబలి2 పట్ల జనం క్రేజిని చూసి బిత్తరపోతున్నారు. ఈ సినిమా పట్ల నా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయ. ఇది కచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నాను. తొలి భాగంపై మా అంచనా అంత పెద్దగాలేదు. అయినా బాహుబలి ది బిగినింగ్ బ్రహ్మాండంగా ఆడింది. తొలిభాగం ప్రదర్శించిన ప్రభంజనం తోటే ఇప్పుడు రెండో బాగంపై అంచనాలు ఎక్కడికో వెళుతున్నాయి అని ముంబై ఫిలిం డిస్ట్రిబ్యూటర్ రాజేష్ తడాని చెప్పారు.
 
సినీరంగ చరిత్రలో ఇదొక కొత్త ప్రమాణాన్ని సృష్టించనుంది. గతంలో కూడా కొన్ని చిత్రాలపై భారీ అంచనా నెలకొంది కానీ బాహుబలి2పై నెలకొన్ని అంచనా అసాధారణమైనది. ఇది కచ్చితంగా దక్షిణాది పరిశ్రమకు ఇతర ప్రాంతాల్లో తలుపులు తెరుస్తుంది  అన్ని తడానీ పేర్కొన్నారు.
 
ఇక ట్రేడ్ నిపుణులు తరణ్ ఆదర్శ్ అయితే బాహుబలి 2 బాక్సాఫీసు వద్ద హరికేన్ సృష్టించనుందని చెప్పారు. వాతావరణం ఇప్పుడు వేడిగా, ఉక్కపోతగా ఉండవచ్చు. కానీ బాక్స్ ఆపీసు మాత్రం ఐస్‌లాగా చల్లగా ఉంది. చిత్రరంగ వాణిజ్యాన్ని పునరుత్తేజం పొందించడానికి బాహుబలి కోసం ఎదురు చూస్తున్నాం. నిజంగానే బాక్సాఫీసు వద్ద పెనుతుఫాన్‌ని ఊహిస్తున్నాం అన్నారు తరణ్.
 
ఇక ఉత్తర భారత్‌లో ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూటర్ జోగిందర్ మహాజన్ అయితే ఈ చిత్రం అద్బుతాన్ని సృష్టించబోతోందని చెప్పారు. బాహుబలి2కి అడ్వాన్స్ బుకింగ్ గొప్పగా సాగుతోంది. ఉత్తర భారత్‌లో ఈ సినిమా ఎంత లాభం తెస్తుందని ఇప్పటికే పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్లో ఈ సినిమా పట్ల ఉన్న హైప్ ఇంతా అంతా కాదు. బాక్సాఫీసు వద్ద అన్నిరికార్డులను ఇది బద్దలు చేస్తుందని మహాజన్ చెప్పారు.
 
ఆన్ లైన్ సంస్థ బుక్ మై షో సీఓఓ ఆశిష సక్సేనా ప్రకారం బాహుబలి2 అడ్వాన్స్ బుకింగ్ కనీవినీ ఎరుగని విధంగా జరుగుతోందని చెప్పారు. అన్ని భాషల్లో బాహుబలి 2 కోసం పది లక్షల టిక్కెట్లను ఇప్పటికే అమ్మేశాం. దక్షిణ భారత ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగానో ప్రేమస్తున్నప్పటికీ హిందీ మాట్లాడే ప్రాంతాల మార్కెట్లనుంచి వస్తున్న స్పందన మమ్మల్నెంతో ప్రోత్సహిస్తోందని సక్సేనా చెప్పారు.
 
దక్షిణాదిలో బాహుబలి2 సినిమా తమిళనాడులో 650 థియేటర్లలో విడుదల అయింది. అక్కడి ట్రేడ్ ఎనలిస్టు ప్రకారం తమిళనాడులో ఇది అతి పెద్ద విడుదల అని చెప్పారు. రజనీకాంత్ నటించిన యందిరన్, కబాలి సినిమాలు కూడా 500 థియేటర్లలో మాత్రమే విడుదల అయ్యాయంటే బాహుబలి మేనియా అక్కడ ఏ స్తాయిలో ఉందో అర్థమవుతుంది. 
 
కేరళలో గ్లోబల్ యునైటెడ్ మీడియా 300 థియేటర్లలో బాహుబలి2ని విడుదల చేస్తున్నారు. ఒక మలయాళీయేతర సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే మొదటిసారి. భారతీయ సినిమా కోసం కొత్త బెంచ్ మార్క్‌ని ఈ చిత్రం నెలకొల్పనుందని సంస్థ సీఈఓ ప్రేమ్ మీనన్ చెప్పారు. 
 
ఇక ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే బాహుబలి 2 మేనియా కనీవినీ ఎరగని స్థాయిలో సాగుతూండటం గమనార్హం. తిరుమల దేవుడికి లేనంతగా సినిమా టికెట్లకోసం 3 కిలోమీటర్ల దూరం క్యూ కట్టడం దేశంలోనే ఎక్కడా జరగలేదు.
 

వెబ్దునియా పై చదవండి