కమల్ హాసన్ కథానాయకుడిగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం భారతీయుడు. తమిళంలో ఇండియన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో భారతీయుడుగా విడుదలైంది. 1996 మే 9న విడుదలైన ఈ చిత్రం ఆదివారానికి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేశాడు అనేది భారతీయుడు కథాంశం.