నాగచైతన్య మజ్నులో రెజీనా: అయేషా శర్మను తప్పించి రెజీనాకు ఛాన్స్!

సోమవారం, 7 డిశెంబరు 2015 (13:46 IST)
నాగచైతన్య మజ్ను ''ప్రేమమ్'' రీమేక్‌లో హీరోయిన్ల వేట ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా ప్రేమమ్ రీమేక్‌లో నటించే అవకాశాన్ని రెజీనా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో రెజీనా ఈ ఛాన్సును సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు చందు మొండేటి 'ప్రేమమ్' రీమేక్‌ను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో స్టోరీపరంగా ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు అవసరం. ముందుగా శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, అయేషా శర్మను ఎంపిక చేశారు. అయితే అయేషా శర్మ విషయంలో చందు మొండేటి మనసు మార్చుకున్నాడని తెలిసింది. 
 
ఆమెకు బదులుగా రెజీనా అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను చివరి నిమిషంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడట. ఇప్పటికే ఈ సినిమా ద్వారా అనుపమ పరమేశ్వరన్ ఒక కథానాయికగా పరిచయమవుతోంది. మళ్లీ మరో కొత్త కథానాయికగా అయేషా శర్మను పరిచయం చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే ఆమెను తప్పించినట్లు.. రెజీనాను తీసుకున్నట్లు సమాచారం. ఎనీవే.. రెజీనాకు మంచి ఛాన్సే దక్కిందని సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి