బీజేపీతో పొత్తు ఉండదు... తెగదెంపులే : సంకేతాలిచ్చిన చంద్రబాబు

గురువారం, 1 మార్చి 2018 (09:34 IST)
భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ టీడీపీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. 
 
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బుధవారం టీ టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు టీ టీడీపీ అధ్యక్ష పదవిని హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని, తమతో చెప్పకుండా బీజేపీతో పొత్తుపెట్టుకోరాదంటూ నినాదాలు చేశారు. 
 
దీంత చంద్రబాబు స్వయంగా వారిని శాంతపరిచారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలియకుండా ఏమి చేయనని స్పష్టంచేశారు. అదేసమయంలో బీజేపీతో పొత్తు ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. 
 
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు