అంతేకాదు.. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి కావడంపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి ఏమైందని స్వామి ప్రశ్నించారు. ఇదంతా చూస్తే శ్రీదేవి హత్యకు గురయ్యే వుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి మరణించడం అనేది సిల్లీగా వుందని.. బాత్ టబ్‌లో గట్టిగా తోసేస్తే కానీ మృతి చెందే అవకాశం లేదని స్వామి వ్యాఖ్యానించారు.