కాగా, యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం భీష్మ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది.
మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా.. దర్శకుడు వెంకీ సినిమాను కమర్షియల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దారు. నితిన్, రష్మిక యాక్టింగ్ అదిరిపోయింది.