#BheeshmaTrailer ''భీష్మ'' ప్రీ-రిలీజ్ ఫంక్షన్.. త్రివిక్రమ్ సెంటిమెంట్ కలిసొస్తుందా?

ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (17:05 IST)
Bheeshma
యంగ్ హీరో నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న భీష్మ సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన బ్యూటీఫుల్ లవ్‌ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 
 
ఇటీవల విడుదల చేసిన టీజర్.. వాట్టే బ్యూటీ, సింగిల్ యాంథెమ్ సాంగ్స్‌‌‌కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ''సింగిల్స్ యాంథెమ్'' వీడియో సాంగ్‌కి మంచి స్పందన వస్తోంది. తాజాగా భీష్మ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు ప్రకటించారు. 
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ''అ..ఆ.." తర్వాత నితిన్‌ హిట్ ముఖం చూడనేలేదు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి త్రివిక్రమ్ అతిథిగా వస్తేనైనా సెంటిమెంట్‌గా హిట్ వస్తుందేమో చూడాలి. భీష్మ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ కామెడీ ట్రాక్ హైలెట్ అవుతుందని తెలుస్తోంది. 
 
ఇకపోతే కుమారి 21 ఎఫ్‌తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కీలక పాత్రలో కనిపించనుండటం మరో ఆసక్తికర అంశం. చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి త్రివిక్రమ్ రాక సినిమాకు మరింత బజ్ తేనుందని అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు