అడవిలో లారీ లోడ్‌తో వస్తుండగా ఓ వ్యక్తి విజిల్ వేయగా, యాక్షన్ సీన్స్ మొదలవుతుంది. రెండు చేతులు వెనక్కి కట్టివేసిన వ్యక్తి మొహం కనిపించకుండా ముసుగు వేసుకుని వస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. ఆ తర్వాత పోలీసులు ఫైరింగ్. ఆ వెంటనే లారీలో డ్రైవర్‌గా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఆ వెంటనే రస్మిక డాన్స్‌తో దర్శనమిస్తుంది. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలు. ఆవేశంగా ఒక వ్యక్తిని కొట్టిన బన్నీ... తగ్గేదే లే.. అంటూ గడ్డం కిందనుంచి చేయి నిమురుకుంటూ అన్న డైలాగ్ పేలింది.
ఈ కార్య్రకమానికి వచ్చిన అనంతరం ఒక్కమాటలో చెప్పాలంటే, ఇదే ఆఖరు మాట పుష్ప గురించి అంటూ అల్లు అర్జున్ తగ్గేదే లే..అన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది.