బిజెపి పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ వస్తున్న అమిత్ షా ప్రత్యేకంగా టైం తీసుకుని ప్రభాస్‌ను కలసి పరామర్శించనున్నారు. కృష్ణంరాజు ఇప్పటికే బిజెపి పార్టీ కార్యకర్తగా వున్నారు. మధ్యలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. అది చారిత్రాత్మక తప్పిదంగా ఆయన ఆ తర్వాత వెల్లడించారు. ఆ తర్వాత బిజెపిలో కొనసాగారు కృష్ణంరాజుగారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా, అనంతరం కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి శ్యామల గారిని, హీరో ప్రభాస్ ని కలిసి నివాళులు అర్పించనున్నట్లు ప్రకటన వెలవడింది.