హాట్‌ సీన్‌లో శ్రీముఖి... హాట్ నటి అనిపించుకుంటుందట...

సోమవారం, 1 ఆగస్టు 2016 (21:57 IST)
తెలుగు నటి అయిన శ్రీముఖి.. మోడల్‌రంగంలో ప్రవేశించి బాలీవుడ్‌లో హంటర్‌ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఓ హాట్‌ టాపిక్‌ కథాంశంలో ఈమె నటిస్తోంది. నిజామాబాద్‌కు చెందని ఈ నటి ఆ ప్రాంతానికి చెందిన దర్శకుడే ఈమెను సెలక్ట్‌ చేశాడు. 
 
బి.టెక్ చదివిన ఈమె మోడలింగ్‌పై మోజుతో ఈ రంగంలోకి ప్రవేశించిది. అయితే.. బుల్లితెరలోనూ కొన్ని ప్రోగ్రామ్‌లు చేసింది. రేష్మి, అనసూయల తరహాలో గ్లామర్‌గా కన్పించేందుకు సిద్ధమైంది. కాగా, తాజాగా రూపొందబోయే నవీన్‌ చిత్రం తెలంగాణ నేపథ్యానికి చెందిన కథ. ఇందులో కాస్త శ్రుంగార పాళ్ళు పాత్రలో వున్నాయనీ.. కథ నచ్చి చేయడానికి సిద్ధమని ప్రకటించింది. మరి సినిమా విడుదలకు ముందు ఆమె ఎటువంటి గెటప్‌ వేస్తుందో తెలియనుంది.

వెబ్దునియా పై చదవండి