అయితే అంజలి నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా ప్రస్తుతం ఒప్పుకుంది. అయితే పెళ్ళి మాత్రం ఇప్పుడే చేసుకోనని, కానీ ఈ లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని చెబుతోంది అంజలి.
నేను ముందు ప్రేమిస్తా.. ప్రేమించిన తరువాత నాకు నచ్చిన లక్షణాలన్ని ఉంటేనే పెళ్ళి చేసుకుంటానని చెబుతోంది అంజలి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అందులో ఎంతమాత్రం నిజం లేదంటోంది. ఆరు అడుగులు ఉండాలి. తెల్లగా ఉండాలి. మందు, సిగరెట్ లాంటి అలవాట్లు అస్సలు ఉండకూడదు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత అన్ని అతనిలో కలిసి ఉండాలని చెపుతోంది.