అబ్బే నాకు అఫైర్ లేదు.. బ్రేకప్ జరిగే ఛాన్సూ లేదు.. అంజలి

సోమవారం, 20 మే 2019 (11:48 IST)
''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' సినిమాలో సీతగా నటించిన అంజలికి ఆపై అవకాశాలు వెల్లువల్లా వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్న స్థాయిలో అంజలికి ఆఫర్లు రాలేదు. కానీ హారర్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా అంజలి నటించిన ''లిసా'' ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. 
 
అయితే అంజలి ఎవరితోనూ అఫైర్ కొనసాగిస్తుందని.. జర్నీ కో స్టార్ జైతో ప్రేమలో వుండి.. ఇప్పుడు బ్రేకప్ చెప్పేసిందని టాక్ వచ్చింది. దీనిపై అంజలి మాట్లాడుతూ... తనకు ఎవరితోనూ అఫైర్ లేదని.. బ్రేకర్ జరిగిందనే వార్తలు చాలా రోజులుగా షికార్లు కొడుతున్నాయని చెప్పింది.
 
''నాకు ఎవరితోను అఫైర్ లేదు కనుక, బ్రేకప్ జరిగే ఛాన్స్ లేదు. స్నేహాన్ని చూసి అపార్థం చేసుకోవద్దు. అలాగే ఇప్పట్లో పెళ్లి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నా దృష్టి అంతా కూడా సినిమాలపైనే వుంది" అంటూ అంజలి క్లారిటీ ఇచ్చేసింది. లిసా తర్వాత సైలెన్స్ అనే సినిమా కోసం అమెరికాలో జరిగే షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు అంజలి స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు