మురుగదాస్ మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947..ఈ కథ చదువుతున్నపుడు చాలా అద్భుతంగా అనిపించింది. కథ చదివినప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా స్పెషల్ మూవీ. ఆగస్టు 16, 1947 పిరియాడిక్ ఫిల్మ్. ఆగస్టు 15 దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఆగస్టు 14, 15, 16 ఈ మూడు రోజుల్లో ఓ మారుమూల పల్లెలో జరిగే కథ ఇది. చుట్టూ అడవి కొండ మధ్య వున్న వూరు. అక్కడికి ఒక వార్త చేయడం కష్టం. ఫ్రీడమ్ అంటే భయాన్ని జయించడం. ఆగస్ట్ 15న ఫ్రీడమ్ వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ఆ ఊరు ఇంకా స్వతంత్రం కోసం పోరాడుతూనే వుంటుంది. ఓ బ్రిటిష్ అధికారి ఈ వార్తని ఓ కారణం చేత వారికి తెలియకుండా దాచిపెడతాడు. వ్యక్తిగతంగా వారికి ఆగస్ట్ 16న స్వతంత్రం పొందుతారు. ఆగస్ట్ 16న ఏం జరిగిందనేది చాలా ఉత్కంఠ భరితంగా వుంటుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్, హ్యుమర్ ఇవన్నీ కలసి ఒక అందమైన కథ వుంటుంది. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాని విడుదల చేస్తున్న మధు గారు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది అన్నారు
గౌతమ్ కార్తిక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16, 1947 నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇంత మంచి ప్రాజెక్ట్ లో భాగం చేసిన మురుగదాస్ గారికి కృతజ్ఞతలు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది. దర్శకుడు చాలా గొప్పగా తీశారు. తెలుగు ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది. చాలా మంచి సినిమా. మీ అందరి ఆదరణ కావాలి అన్నారు.