అల్లుడుకు పేరొస్తే అత్తకు కూడా ఆనందమేకదా. ఇప్పుడు ఆ ఆనందాన్ని రామ్‌చరణ్ అత్తగారు అనుభవిస్తున్నారు. ఇటీవలే రామ్‌చరణ్, ఎన్.టి.ఆర్. నటించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేయడమేకాకుండా చిన్న స్టెప్ కూడా వేశారు. ఈ స్టెప్ వేసే చిన్న వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తల్లి శోభనా కామినేని స్టెప్ వేయడం నాకూ మరింత ఆనందంగా ఉందంటూ, ఐ లవ్ యూ మా.. అంటూ పోస్ట్ చేసింది.