హీరో ప్రభాస్, దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "బాహుబలి-2". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఎపుడెపుడు రిలీజ్ అవుతుందా అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. చిత్రానికి సంబంధించిన విషయాలను బయటకు పొక్కకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.