రూ.200 కోట్ల క్లబ్‌లో ''రంగస్థలం''.. భరత్‌కు టెన్షన్ మొదలైందా?

బుధవారం, 25 ఏప్రియల్ 2018 (17:22 IST)
''రంగస్థలం'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 1980 నాటి గ్రామీణ వాతావరణంలో ఎమోషనల్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్ చెరుకూరి కలసి నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
మార్చి 30వ తేదీన విడుదలైన ఈ సినిమా తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. మగధీర తర్వాత ''రంగస్థలం'' అంతటి స్థాయిలో చెర్రీకి హిట్ తెచ్చిపెట్టింది. చెర్రీ సినిమాలన్నింటిలోనూ ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. 
 
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ''భరత్ అనే నేను'' సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌కు చేరింది. దీంతో ''రంగస్థలం'' రికార్డును అధిగమించే అవకాశం వుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ "భరత్ అనే నేను'' థియేటర్స్‌కి వచ్చినా, ''రంగస్థలం'' వసూళ్లు ఆశించిన స్థాయిలో తగ్గలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు