భీష్మ సరాసరి సాంగ్ రిలీజ్ - యూట్యూబ్‌లో సెన్సేషన్

శుక్రవారం, 20 మార్చి 2020 (18:47 IST)
యువ హీరో నితిన్ - క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటించిన చిత్రం భీష్మ. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకులకు ద్వితీయ విఘ్నం ఉంటుంది. ఈ సినిమా వెంకీ కుడుములకు రెండో సినిమా కాబట్టి.. ద్వితీయ విఘ్నాన్ని సక్సస్‌ఫుల్‌గా దాటుతాడా లేదా అనే టెన్షన్ ఉండేది కానీ... ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సస్ సాధించి కెరీర్లో దూసుకెళుతున్నాడు. 
 
ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి చూసి చాలా బాగుందని డైరెక్టర్‌ని అభినందించారంటే.. ఈ సినిమా బాగుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా బాగుండాలి అంటే... బలమైన కథ ఉండాలి అనే సూక్తిని ఫాలో కాకుండా.. సింపుల్ స్టోరీనే తీసుకుని సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తీసిన సినిమా భీష్మ. ఒక కమర్షియల్ సినిమా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆయా అంశాలను మేళవిస్తూ, ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకోవడంతో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ కుడుముల. 
 
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సస్ అవ్వడంతో కథలో చిన్న చిన్న లోపాలు ఉన్న పట్టించుకోలేదు. ఛలో సినిమాకి అద్భుతమైన ట్యూన్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఈ సినిమాకి డీసెంట్ ఆల్బమ్ ఇచ్చాడు. ఆర్.ఆర్ పరంగా మాత్రం అదరగొట్టాడు. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్‌గా నిలిచింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. 
 
సినిమాపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా షూటింగ్‌కి ముందే ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాతో సెకండ్ సినిమా హర్డిల్‌ని ఈజీగా దాటేశాడు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న భీష్మ  నితిన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయానికి మరో కారణం పాటలు అని చెప్పచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 
 
ప్రతి పాటలో మహతి స్వర సాగర్ తన టాలెంట్ చూపించాడు.  రీసెంట్‌గా ఈ సినిమాలోని సరాసరి.. అంటూ సాగే సాంగ్ వీడియోను రిలీజ్ చేసారు. శ్రీమణి పాడిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. గ్రామీణ నేపధ్యంలో చిత్రీకరించిన ఈ పాటకు తగ్గట్టుగా సాహిత్యం, సంగీతం, సినిమాటోగ్రఫీ.. అన్నీ కుదరడంతో ఈ వీడియో సాంగ్ యుట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా రికార్డు వ్యూస్‌తో దూసుకెళుతుంది. భీష్మ సినిమాతో రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన నితిన్.. ఇప్పుడు భీష్మ సాంగ్స్‌తో యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు