బిగ్ బాస్ షో చేయడానికి ఎవరు కారణమన్న విషయాన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లాంఛింగ్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తనను ఈ ‘బిగ్‌బాస్’ షో చేయడానికి ఎవరు ఒప్పించారనే విషయాన్ని బహిర్గతం చేశారు.
అంతేకాకుండా, బిగ్ బాస్ రియాలిటీ షోకు తనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలపై కూడా ఆయన స్పందించారు. తన భార్యాబిడ్డల్ని చూసుకునేంత డబ్బులు ఇప్పటికే తన వద్ద ఉందన్నారు. అయితే ఈ షో కోసం రెమ్యూనరేషన్ మాత్రం మీడియా చెబుతున్నంత ఎక్కువ ఇవ్వలేదని చెప్పారు.
ఇంతవరకు రెమ్యూనరేషన్ గురించి ఏనాడూ పెద్దగా ఆలోచించలేదని, మీడియా ప్రతినిధులు అడుగుతుంటే ఈసారి రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోవాలని అనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. బిగ్ బాస్ కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదని, అంతకంటే మంచి అనుభవమని, అందుకే సరికొత్త ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.