తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన అద్దంకి దయాకర్ హీరోగా మారనున్నారు. ఆయన పాన్ ఇండియా మూవీలో నటించారు. ఈ చిత్రానికి బొమ్మక్ మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటివరకు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో కనిపించిన దయాకర్, సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తుండటంతో అతడి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.