ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాలో గీతా ఫొగట్‌గా నటించిన ఫాతిమా సనా షేక్‌పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఫాతిమా బికినీలో కనిపించడమే అందుకు కారణం. అమీర్ ఖాన్ నిర్మించిన దంగల్‌లో అద్భుతంగా నటించిన ఈమె.. ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది. మాల్దీవుల్లో సముద్రపు తీరంలో... స్మిమ్ సూట్లో దిగిన కొన్ని ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలను నెటిజన్లు లైక్ చేస్తున్నప్పటికీ మత సంరక్షకులు మాత్రం... పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలాంటి అసభ్యకరమైన ఫొటోలను పోస్ట్ చేస్తావా? అంటూ సనాపై నిప్పులు చెరిగారు. ఆమెను కించపరుస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకునే హక్కు ఆమెకుందని చెప్తున్నారు. స్విమ్ సూట్‌లో ఫాతిమా పోస్టు చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.