పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్‌గా సన్నీలియోన్ మారింది. కానీ, ఆమెలో ఉన్న పోర్న్ స్టార్ బుద్ధి మాత్రం పోలేదు. ఇటీవలే ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్న సన్నీ.. తాజాగా ఇద్దరు కవలలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చింది.
అయితే, తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా సన్నీ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. 'తండ్రిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, భర్తగా.. మహిళకు జీవితాంతం తోడుగా నిలిచే వ్యక్తికి జోహార్లు. అతడి ప్రేమ అనంతం. మేమంతా మీ ప్రేమకు బానిసలం నాన్నా' అంటూ సన్నీ ఓ పోస్ట్ చేసింది.
అయితే ఆ పోస్ట్‌తోపాటు ఆమె షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ ఫోటోలో భర్త, కూతురితోపాటు సన్నీ ఉంది. అయితే సన్నీ నగ్నంగా ఉండటం విమర్శలకు కారణమైంది. తల్లి అయిన తర్వాతైనా పద్ధతిగా ఉండటం నేర్చుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు.