త్రిస్సూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం మరణించారు. కొద్ది రోజుల క్రితం సాచీ తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అతనికి జూన్ 16న గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కేరళలోని త్రిస్సూర్‌లో జూబ్లి మిషన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వైద్యానికి ఆయన శరీరం స్పందించకపోవడంతో గురువారం రాత్రి 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.