'భారతీయుల తీరు ఇలాగే ఉంది. మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము. మన స్నేహితులని, కూరగాయలు అమ్మే వారికి కరోనా లేదు కదా నాకు కూడా రాదు అని అనుకుంటున్నారు. నాకు కరోనా రాదు అనే భావనలో ఉన్నారు.
కానీ, అందరిలోనూ కరోనా ఉందనే భావనతో వ్యవహరించండి. అలాంటప్పుడే కరోనాకు దూరంగా ఉండొచ్చు. కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్ చేయండి. సూపర్ మార్కెట్లో బిల్ కట్టి తిరిగి కార్డు తీసుకున్న తర్వాత శానిటైజ్ చేయండి' అని తేజ చెప్పారు.