అందాల తార కాజల్ అగర్వాల్‌ను "లక్ష్మీ కళ్యాణం" సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ. తొలి సినిమాతోనే కాజల్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత "మగధీర" సినిమాలో రాంచరణ్ సరసన నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. స్టార్ హీరోలు, యువ హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.
వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించారు. టీజర్, ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. ఈ నెల 24న 'సీత' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలావుంటే, కాజల్‌తో తేజ మరో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈసారి లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. కథ కూడా రెడీ చేసారట. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ మూవీకి నిర్మాతలు కూడా రెడీగా ఉన్నార.