కానీ అదేరోజు మెగాస్టార్ చిరంజీవి మంచు మోహన్‌బాబుకి ఫోన్ చేయడం, అభినందించడం, కలిసి పనిచేయాలనుకోవడం, నేను ఎవరికీ సపోర్ట్ చేయలేదనీ అనడం జరిగిపోయాయి. అయితే ఇదంతా గమనించిన మంచు విష్ణు అలయ్ బలయ్ కార్యక్రమంలో ఏం జరిగిందనేది మంగళవారంనాడు చెప్పుకొచ్చారు.
మీడియా రాసిందానికి జరిగినదానికి సంబంధమేలేదు. ప్రోటోకాల్ కారణంగా పవన్ కళ్యాణ్ తో వేదిక పై మాట్లాడలేదు. వేదికపై కాకుండా వేదికకు వచ్చేముందు `మా` గురించి కుటుంబ విషయాల గురించి చాలా చర్చించుకున్నాం. మెగా ఫ్యామిలీ మంచు కుటుంబం, మేమంతా కుటుంబ స్నేహితులం. ఎన్నికల్లో చూసేవారికి విరోధులుగా మీడియా ట్రీట్ చేసింది. అసలేం జరిగిందే తెలుసుకోవాలి గదా. అంటూ పవన్, మంచుని ఆప్యాయంగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెబుతున్న క్లిప్‌లను విడుదల చేశారు. ఆ పక్కనే సీనియర్ నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు, బిజెపి నాయకుడు కూడా సాక్షిగా నిలిచారు.