డ్రగ్స్ కేసులో రవితేజకు నోటీసులు... 22న హాజరు కావాలి... మావాడు అలాంటోడా?

సోమవారం, 17 జులై 2017 (14:25 IST)
ఎట్టకేలకు డ్రగ్స్ కేసులో హీరో రవితేజ పేరు వుండటం వాస్తవమేనని తేలింది. ఆయనకు ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 22న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని తెలియజేసింది. దీనితో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన కుమారుడు కనీసం సిగరెట్ కూడా తాగడనీ, తాగేవాళ్లను కూడా ప్రోత్సహించడని అన్నారు. 
 
డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్న ఆమె తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు ఉందన్న మాట అవాస్తవమన్నారు. రవితేజను కావాలనే ఎవరో ఇరికిస్తున్నారని అన్నారు. సోదరుడు పోయాడన్న బాధలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడనీ, నిర్మాతలకు నష్టం రాకూడదన్న ఒకే ఒక నిశ్చయంతో సినిమా షూటింగులకు వెళ్లాడని చెప్పుకొచ్చారు. 
 
తన కుమారుడు భరత్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యాడనీ, ఇందులో భాగంగా అతడు అన్నీ మానేసి రోజూ వ్యాయామం చేసేవాడనీ, కానీ విధి వక్రించి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి