'ఆర్య' నుంచి 'సరైనోడు' వరకు డిఫరెంట్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో స్టైలిష్ స్టార్‌గా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లుఅర్జున్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'సరైనోడు' చిత్రంతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్న బన్ని తెలుగులో చిత్ర సీమలోనే కాదు, మలయాళ సినీ పరిశ్రమలో కూడా తనదైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఒక పక్క యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ తమ ఇంటి అబ్బాయిగా భావించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం `డిజె దువ్వాడ జగన్నాథమ్`. అలాగే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరోను ఎలా తెరపై ప్రెజెంట్ చేయాలో తెలిసిన డైరెక్టర్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలా అతి కొద్ది మంది మాస్ డైరెక్టర్స్‌లో ఒకరు హరీష్ శంకర్.ఎస్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ మూవీ చేసిన హారీష్ శంకర్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంతో హరీష్ సాయిధరమ్ తేజ్‌ను కమర్షియల్ హీరో చేశాడు.
ఇలాంటి మాస్ యూత్ అండ్ పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్.. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో మూవీ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు మెగా అభిమానులు, అటు ఇండస్ట్రీ అంతా ఎలాంటి సినిమా రానుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, ఇప్పుడున్న నిర్మాతల్లో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్‌లో గతంలో 'ఆర్య', 'పరుగు' వంటి సూపర్ డూపర్‌హిట్ మూవీస్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు కాంబినేషన్‌లో మూవీ ఒకటి, హరీష్ శంకర్, బన్ని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, బన్ని కాంబినేషన్‌లో మూవీ ఇలా క్రేజీ కాంబినేషన్స్ అంతా ఒకే సినిమాకు కుదరడంతో.. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే వచ్చాయి.
ఈ అంచనాలను మించుతూ హరీష్ శంకర్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను ప్రెజెంట్ చేస్తూ సినిమాను తెరకెక్కించాడనడానికి సాక్ష్యమే `డిజె దువ్వాడ జగన్నాథమ్` టీజర్. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే టీజర్‌కు ఐదు మిలియన్స్‌కు పైగా వ్యూస్ రావడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. అల్లుఅర్జున్ ఇది వరకు నటించిన చిత్రాలకు భిన్నంగా చేస్తన్న ఈ చిత్రంలో బన్ని లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. హీరోలకు సింగిల్ లైనర్స్ రాయడంలో నిష్ణాతుడైన హరీష్ శంకర్ రాసిన డైలాగ్ వైరల్ అయ్యింది. బన్ని సింపుల్‌గా చెప్పిన కామెడి డైలాగ్ ఫేమస్ అయ్యింది. అలాగే మెగా ఫ్యాన్స్, ఆడియెన్స్ పల్స్ పసిగట్టడంలో దిట్ట అయిన హరీష్ శంకర్ టీజర్‌లో ప్రతి సెకన్‌ను ఎగ్జయిటింగ్ కలిగేలా ప్రెజెంట్ చేశారు. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఫాలోయింగ్, హరీష్ శంకర్ టేకింగ్, మేకింగ్, బ్యానర్ వేల్యూ ఇవన్నీ కలగలవడంతో టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకెళుతుంది.