రామ్‌చరణ్ ఇంతకుముందు సినిమాలు చేసినా ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఆయన క్రేజ్ మారిపోయింది. దాదాపు నార్త్‌లోని ముఖ్యమైన నగరాలలో రాజమౌళి సినిమా ప్రమోషన్ సందర్భంగా చుట్టేశారు. దాంతో ఎన్.టి.ఆర్., రామ్‌చరణ్‌కు క్రేజ్ తెగ వచ్చేసింది. ఆ ఎఫెక్ట్ తాజాగా సోమవారంనాడు చరణ్‌కు కనిపించింది. తమిళ దర్శకుడు శంకర్‌తో రామ్‌చరణ్ సినిమా చేస్తున్నాడు. ఆర్.సి.15 అనే వర్కింగ్ టైటిల్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.