గోపీచంద్, సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని మంగళవారం నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభమైంది. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాలుగో షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావులు మాట్లాడుతూ.. "థాయ్‌ల్యాండ్, హైదరాబాద్‌లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇక మంగళవారం నుంచి మొదలై ఫిబ్రవరి 20 వరకూ జరగనున్న నాలుగో షెడ్యూల్‌లో హీరోహీరోయిన్లు గోపీచంద్-రాశీఖన్నా-కేతరీన్‌లపై కాంబినేషన్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసేందుకు దర్శకుడు సంపత్ నంది సన్నాహాలు చేసుకొంటున్నారు.
రామ్-లక్ష్మణ్‌ల నిర్వహణలో చిత్రీకరించబడనున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. ఇక సంపత్ నంది యాక్షన్ సీన్స్ తోపాటు ఎమోషనల్ సీన్స్‌ను హ్యాండిల్ చేసిన విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తన కెమెరాలో బంధించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. గోపీచంద్ ఈ సినిమాలో సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నారు.