రామ భక్త హనుమాన్‌కు కోవిడ్ పాజిటివ్

మంగళవారం, 14 డిశెంబరు 2021 (13:54 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపి మళ్లీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. 
 
"నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్యుల సూచనల మేరకు తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ మధ్య నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. రామ భక్త హనుమాన్ జై" అంటూ ట్వీట్ చేశారు. 
 
కాగా, ఇటీవలే బాలీవుడ్ నటి కరీనా కపూర్ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఆమెతో పాటు.. ఆమె స్నేహితురాలు కూడా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు