ఐదేళ్ల చిన్నారికి గుర్తు తెలియని వ్యాధి.. వీరాభిమానిని పరామర్శించిన రామ్!

శనివారం, 13 ఆగస్టు 2016 (15:16 IST)
విశాఖపట్టణంలో మృత్యువుతో పోరాడుతున్న ఐదేళ్ల బాలిక పూర్ణచంద్రికను సినీ హీరో రామ్‌ శుక్రవారం కలిశారు. ఎంవీపీ కాలనీలోని రవికుమార్‌ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక పుట్టినప్పటి నుంచి కాళ్లను కదపలేక నానా అవస్థలు పడుతోంది. గుర్తు తెలియని వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ఇక ఎక్కువ కాలం బతకలేదని వైద్యులు నిర్థారించారు. పూర్ణచంద్రిక టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌కు వీరాభిమాని. 
 
తన ఆరాధ్య నటుడు విశాఖలో జరుగుతున్న షూటింగ్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ బాలిక అతడిని చూడాలని తల్లిదండ్రులని కోరింది. దీంతో తల్లిదండ్రులు యూనిట్ సభ్యులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న రామ్ ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. పాప ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కదలలేని స్థితిలో ఉన్న బాలికను ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడారు. అంతేకాదు పాపకు ధైర్యం చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి