హృతిక్ శౌర్య హీరోగా ఫ్లిక్ నైన్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెం 1గా రవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఓటు' అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. 'చాలా విలువైనది' అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. పేపర్ కట్స్ బ్యాక్ డ్రాప్ లో హీరో హృతిక్ శౌర్య సీరియస్ గా ఆలోచిస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు.