భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాటలో జానపద గాయకుడు, కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలియ్య పాడిన మొదటి చరణాలు పాటకే హైలెట్‌గా చెప్పొచ్చు. మధ్యలో మరో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల గానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ, ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటలోని లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టలో ఈ పాటపై స్పందించారు.
తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ.. మేము ఎవరి రక్షణ కోసమైతే తాము జీతాలు తీసుకుంటున్నామో.. వారి బొక్కలు తాము విరగ్గొట్టం.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి పోలీసుల ఛరిష్మాను వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవలు ఇందులో ఎక్కడ పేర్కొనలేదు అని ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.