'కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లను చూసి నా మనసు చెలించిపోయింది. చేతనైనంత సాయం అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాను. ఈ సేవా కార్యక్రమాల్లో మా కుటుంబం మొత్తం నాకు అండగా ఉంది. నా భార్య, పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు సైతం సాయం కోరుతూ ఎంతోమంది మెస్సేజ్‌లు పంపుతున్నారు.
వాటిని చూసిన వెంటనే వాళ్లు నాకు చెబుతున్నారు. అలా వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించేలా పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ఉంది. కానీ, అది ఇప్పుడే సాధ్యం కాని పని. ఉచిత వైద్యం అందించేలా ఆస్పత్రులు మాత్రం నిర్మించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తప్పకుండా అది చేస్తాను అని సోను చెప్పుకొచ్చారు.