దర్శకుడు కొరటాల శివ చేసింది మూడు సినిమాలే అయినా అగ్రహీరోలతోనే చేశాడు. ఇలా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు జనతా గ్యారేజ్ సక్సెస్ సమయంలో వెల్లడించారు. శనివారంనాడు ఆ చిత్రం విజయోత్సవం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఎన్టిఆర్ కెరీర్లో బెస్ట్ చిత్రంగా నిలిచిందనీ, కలెక్షన్లు అద్భుతంగా వున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే తన వద్ద 6, 7 కథలు సిద్ధంగా వున్నాయనీ.. అందులో మరలా ప్రభాస్‌తో వుంటుందని వెల్లడించారు.
స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ లేడా! అనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఖచ్చితంగా పవన్‌తో సినిమా చేయగలనని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి పరిస్థితిని బట్టి పవన్‌కు కథ రాయడం.. అది ఆషామాషీ కథ వుండకూడదని.. స్థాయిని మరింత పెంచే కథను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు. పవన్‌లో మానవీయకోణం ఆవిష్కరించే పాయింట్‌తో వస్తానని తెలియజేస్తున్నాడు.
ఇప్పటికి.. తను పలు విజయవంతమైన చిత్రాలకు ఘోస్ట్ రచయితగా వున్నాననీ, కొన్నింటికి తన పేరు కూడా వేయలేదనీ, ఇలాంటివి ఇండస్ట్రీలో మామూలేనని చెప్పిన తర్వాత కొరటాల శివపై అగ్ర హీరోలకు మరింత దగ్గరయ్యారు. త్వరలో పవన్ నుంచి పిలుపు వస్తుందని ఫిలింనగర్లో విన్పిస్తున్నాయి.