అమెరికన్ యాసలో నాటునాటు.. సాంగ్ గురించి చెప్పమనగా.. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే డాన్స్‌గా పేర్కొంటూ ఆ పాటను క్లిప్పింగ్ చూపించారు. బెస్ట్‌ఫ్రెండ్ ఎలా వుంటాడో ఈ సినిమాలో దర్శకుడు రాజమౌళి చూపించారు. టేకింగ్ పరంగా టోటల్‌గా చూస్తే రాజమౌళి గారు ఇండియన్ స్పీల్ బర్గ్ అంటూ కితాబిచ్చాడు. ఈజ్ టు ట్రూ.. అంటూ అక్కడ యాంకర్ అడుగగా.. అందుకే కదా ఆస్కార్‌కూ నామినేట్ అయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇడియన్ సినిమా ఇంత దూరం రావడం చెప్పలేని ఆనందంగా వుందని పేర్కొన్నారు. నెక్ట్స్ వరల్డ్ ఫిలిం ఆయన్నుంచి రాబోతుంది అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు..
ఆ తర్వాత ఉపాసన గురించి చర్చ వచ్చింది. షీ ఈజ్‌డాక్టర్.. అంటూ యు.ఎస్.ఎ.కు వృత్తిరీత్యా అప్పుడప్పుడు వస్తుందని రామ్‌చరన్ చెప్పగా, యస్. ట్రూ.. ఐ నో హర్. అంటూ మరో యాంకర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. అవార్డుతోపాటు బేబీకి జన్మనిస్తున్నారంటూ.. చరణ్‌నుద్దేశించి అనగానే. చాలా ఆనందంగా వుంది. అదృష్టంగా వుందంటూ పేర్కొన్నారు. ఇలా రామ్ చరణ్‌తో వారు ఇంటర్వ్యూ చేశారు. ఇండియన్ సినిమా గురించి చాలా గర్వంగా చెప్పారు. ఇంటర్వ్యూలో ఎక్కడా తెలుగు సినిమా అనికానీ, సౌత్ సినిమా అని కానీ అనకుండా ఇండియన్ సినిమా అని పేర్కొడం గొప్పవిషయం.