ఇప్పటికే సినిమా యూనిట్ అంత సంబరాలు చేసుకుంటుంటే, ఎన్టీఆర్ వారందరి కంటే ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. బాక్సాఫీస్ దగ్గర జనతా సాధిస్తున్న వసూళ్లు ఆనందాన్ని కలిగిస్తున్నాయని తెలిపాడు.
ఇంకేముంది.. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుస హ్యాట్రిక్ హిట్లతో ఎన్టీఆర్ కెరియర్ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవరసరం లేదు.. సరైన కథ దొరికితే బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తాడని మరోసారి జనతా గ్యారేజ్‌తో నిరూపించుకున్నాడు.