గౌతమిపుత్ర శాతకర్ణిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఏంటి?

ఆదివారం, 15 జనవరి 2017 (17:54 IST)
గౌతమిపుత్ర శాతకర్ణి బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చాలా బాగుందని  దర్శకులు కొనియాడారు. అటు బాలయ్యను, ఇటు డైరెక్టర్ క్రిష్‌ను అభినందనలతో ముంచెత్తారు. కానీ, నందమూరి హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. చిరంజీవి దగ్గర్నుంచి మెగా కాంపౌండ్‌లో సాయిధరమ్ తేజ్ వరకు, డైరెక్టర్లలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుంచి దర్శక ధీరుడు రాజమౌళి, వివాదాల డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వరకు స్పందించారు. 
 
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నోరెత్తలేదు. సినిమా విడుదలకు ముందు బాబాయ్‌కు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన తారక్ సినిమా విడుదలయ్యాక మాత్రం తన స్పందనేంటో చెప్పలేదు. తన అన్నయ్య కల్యాణ్ రామ్ మాత్రం సినిమా చూసి ‘స్టన్నింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో తారక్ సినిమా చూడలేదా? అన్న అనుమానాన్ని నందమూరి అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. కల్యాణ్‌రామ్ చూశాడంటే తారక్ ఎందుకు గౌతమీపుత్ర శాతకర్ణి‌పై ఎందుకు స్పందించలేదు. మరి ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి